Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

తెలుగు ప్రేక్షకుల కొత్త క్రష్‌ ఈమె..!

తెలుగులో తెలుగమ్మాయిలు చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తూ ఉంటారు. మనం మాత్రం పరభాషా హీరోయిన్లనే అచ్చు తెలుగమ్మాయిలా ఉంది.. మంచి గ్లామరస్‌గా కనిపిస్తోంది... అంటూ వాళ్లకు కాంప్లిమెంట్స్‌ ఇస్తూ ఉంటాం. కానీ తెనాలిలో పుట్టి వైజాగ్‌లో చదువుకున్న యువతి శోభిత  ధూళ్లిపాళ్ల. ఈమెకి చిన్ననాటి నుంచి సినిమాలంటే పిచ్చి. దాంతో పై చదువుల కోసం ముంబైకి వెళ్లగానే మోడల్‌గా మారింది. 2013లో 'మిస్‌ ఇండియా ఎర్త్‌' టైటిల్‌ని గెలుచుకుంది. ఆ టైటిల్‌ ఇచ్చిన ఉత్సాహంతో ఇండియాలో పలువురు సెన్సేషన్‌ హీరోయిన్లు దర్శనమిచ్చిన 'కింగ్‌ఫిషర్‌ క్యాలెండర్‌ 2014'లో బికినీతో అదరగొట్టింది. మోడల్‌గా రాణిస్తూనే దేశంలోనే చెప్పుకోదగిన దర్శకుడు అయిన అనురాగ్‌కశ్యప్‌ తీసిన 'రమణ్‌ రాఘవ్‌ 2.0' సినిమాలో హీరోయిన్‌గా చాన్స్‌ కొట్టేసింది. 

ఈ చిత్రంలో ఎంతో గ్లామరస్‌గా కనిపిస్తూ న్యూడ్‌గా కూడా దర్శనమిచ్చి యూత్‌ మతులు పోగొట్టింది. ఆ తర్వాత పలు మేగజైన్ల కవర్‌పేజీలపై దర్శనమిచ్చింది. అయితే ఆమెకి తన సొంత భాష అయిన తెలుగులో నటించాలని కోరిక ఉండేది. అది కొంత కాలం కిందట అడవిశేష్‌ హీరోగా వచ్చిన 'గూఢచారి'లో అవకాశం రావడం, ఈ సినిమా పెద్ద హిట్‌ కావడంతో ప్రస్తుతం ఈమె చిన్న సినిమాలకు పెద్ద స్టార్‌ అయింది. తెలుగు యూత్‌ని లేటెస్ట్‌ క్రష్‌ శోభిత ధూళ్లిపాళ్ల అని చెప్పాలి. 

ఇక సినిమా కథానుసారం గ్లామర్‌ పాత్రలకైనా, నటనాప్రతిభను చూపించే పాత్రలకైనా ఓకే అంటోంది. సినిమా డిమాండ్‌ చేస్తే ఎలా నటించడానికైనా తనకు ఇబ్బంది లేదని స్టేట్‌మెంట్స్‌ ఇస్తోంది. 'గూఢచారి'లో ఆమె పోషించిన సమీరారావు పాత్ర ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. ఈమె ఈ ఏడాది చివరలో 'మూథన్‌' పేరుతో మలయాళంలో రూపొందుతున్న చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో నవీన్‌పౌల్‌ హీరోగా నటిస్తున్నాడు. మరి ఈ తెలుగమ్మాయి రాబోయే రోజుల్లో ఎలాంటి సంచలనాలకు కేంద్ర బిందువుగా మారుతుందో వేచిచూడాల్సివుంది...! 



from Telugu Unicode News feed from Cinejosh.com https://ift.tt/2PTuh2N

Yorum Gönder

0 Yorumlar